9.15.2013

భ్రమణం

క్వాంటం భౌతిక నియమాలననుసరించి ఈ సృష్టిలో కాలమన్నది మిధ్య అట...
ఆద్యాత్మికంగా గణికులలో కాలాన్ని నేను అని భగవానుడు ఉవాచించాడు...
అసలు కాలమన్నదే లేకుంటే లేక కాలమన్నది దేవుడైతే ఈ లోకంలోకి కొత్తగా వచ్చేవి,పోయేవి ఏముంటాయి...?
మనిషి ఊహ కూడా కాలంతో పెనవేసుకుని పరుగెడుతుంటే పాతవి పోతున్నాయి...కొత్తవి సృస్టించబడుతున్నాయి అనే భ్రమలో మనమున్నామా...?
కాలమన్న భావనే మనకు లేకుంటే చావు పుట్టుకలు,సుఖ దుఃఖాలు,ద్వేషాలు,విద్వేషాలు ఏవీ లేవు...
కొత్తగా వచ్చేవీ,పాతబడి పోయేవీ లేవు...
అసలిక్కడ ఉన్నదేదీ లేదు...
లేనిదేదీ లేదు...
నిశ్చితత్వంలో అనిశ్చిత చలనం
శాశ్వితత్వంలో అశాశ్విత భ్రమణం తప్ప...!

ఆత్మతో పాటు దేహమూ శాశ్వితమే.........



చెట్టు నుంచి నేల మీద పడ్డ విత్తనం గాలిని,నీతిని,వివిద ధాతువుల్ని గ్రహించి మొలకగా,మొక్కగా,వృక్షంగా ఎదుగుతుంది.
అదే చెట్టు చనిపోయినప్పుడు వివిధ ధాతువులుగా తిరిగి ప్రకృతిలో కలసిపోతుంది.
వివిధ ధాతువులు ఒక రూపంగా,ఒక రూపం వివిధ ధాతువులుగా నిరంతరం ఒక భ్రమణం జరుగుతుందే తప్ప ఈ లోకంలో ఏవీ కొత్తగా సృష్టించబడవు...నాశనమూ కావు.
గీతా జ్ఞానం మేరకు ఆత్మ మాత్రమే శాశ్వితం...దేహం అశాశ్వితం.
నా జ్ఞానం మేరకు దేహమూ ఆత్మా రెండూ శాశ్వితమే....!
దేహం వివిధ ధాతువులుగా రూపాంతరం చెందుతూ ఈ ప్రకృతిలోనే వుంటుంది కాబట్టి అది శాశ్వితం.
ఆత్మ అంటే దేహ చైతన్యమనే ప్రాణ శక్తి...
ఆ చైతన్యం దేహాన్ని వీడడమే మరణం...
భౌతికశాస్త్ర నియమాలననుసరించి శక్తి రూపం మార్చుకుంటుందే కాని నాశనం కాదు...
కావున ఆత్మకూడా శాశ్వితమే....!
దేహ ఆత్మలు రెండూ ప్రకృతి అనే పరమాత్మలో శాశ్విత భ్రమనాలు.....!

నాతో నేను

లక్ష కోట్ల కణ సముదాయం నేను
జన సమూహమై విరాజిల్లుతున్నాను .
ఏ'కాంత' జీవిని నేను
వేయి కాంతలుగా గుణించుకుంటున్నాను.
విడదీయలేని జన సంద్రమైన నేను
ఒంటరినై విభాగించుకుంటున్నాను.
తలపుల తలుపులు మూసి
నన్ను నేను పరిత్యజించుకోలేక
కిరాయి గదిలో పరాయి  బ్రతుకు
గడుపుతున్నాను.

నగ్నతే స్వచ్చత

మనిషిని ఆవహించిన మతాలన్నీ
మృత కనాలై రాలిపోవాలి.
మనసును ఆవహించిన ఇజాలన్నీ
వృనాలై తొలగిపోవాలి.
ఆంక్షలూ కాంక్షలూ దాటి
అత్యంత స్వచ్చమైన మనీషి
నగ్నమై నిలిచిపోవాలి.

దేవుడు ప్రకృతి - మతం వికృతి

దేవుడు తన ప్రతినిధిగా నన్ను నియమించి మానవాళికి మోక్షమార్గం చూపించమని చెప్పాడని ఒక ప్రవక్త ఒక మతాన్ని ప్రకటించాడు...
మరి ఆ మోక్షమార్గంలో పవిత్ర యుద్ధం పేరుతో లెక్కకు మించి హత్యలు అరాచకాలు జరిగాయి...జరుగుతున్నాయి...!
తప్పెక్కడ జరిగిందంటారు?

మరి ఇంకో పరలోక మార్గదర్శి తన రక్తంతో సకల జనుల పాపాలను పరిశుద్ధం చేశానన్నారు....మరి ఈ జనాల్లో అంతులేని భేషజాలేంటి...?
ద్వేషభావాలేంటి...?
ఆయన చెప్పిన ప్రేమతత్వం మచ్చుకైనా కనిపించడం లేదెందుకు?

ఈ సకల చరాచర సృష్టిలో ప్రతి జీవుడు నేనే...ప్రతి పదార్ధము నేనే అని ప్రకటించుకున్న భగవానుడిని కాదని ముక్కోటి దేవతలెలా వచ్చారు?
ద్వైతమేంటి?అద్వైతమేంటి?విశిస్తాద్వైతమేంటి?వైష్ణవమేంటి?శైవమేంటి?

అహింసే పరమధర్మమని చాటిన బుద్దుడి బోధనలను ఈ ప్రపంచం తలకేక్కిన్చుకోలేదా....?

ప్రవక్తలు మంచే చెప్పారు,ప్రజలే తప్పుగా అన్వయించుకున్నారు అంటారా?
మరి ఆ తప్పొప్పుల తాత్పర్యాన్ని మార్చే మరో మతమేదో కావాలా మనకు....?
ఐతే ఆ మతాన్ని నేను ప్రాకృతిక జీవనం అంటాను...
ప్రకృతితో మమేకమై బ్రతకడాన్ని మించిన మతమే లేదంటాను.

(గమనిక: ఏ మతం వారి మనోభావాలనూ గాయపరిచే ఉద్దేశ్యం నాకేంతమాత్రమూ లేదు...అలాంటి మనోగాయాలకు బాద్యత వహించబడదు)

మూడు ఆర్లు

ఆరంగులాల గర్భసంచి
ఆరంగులాల ఆకలిసంచి
ఆరడుగుల నేలతల్లి
మూడు ఆరుల మద్య
మూడుముక్కలాట 'జీవితం'.

మరణాన్ని కాసేపు నిరాకరించు

మరణాన్ని కాసేపు నిరాకరించు

దండయాత్రకై బయలుదేరావా
ఓనా చిట్టి తండ్రీ...
చిట్టచివరికైనా
నిన్ను నువ్వు జయించుకోగలవా....?

అంతులేని సంపదను
మూటగట్టి తెచ్చుకుంటావా
విప్పి చూడరా బడవా
అది ఒట్టి బూడిదేనని
తెలుసుకోవా...?

ఏ కొత్త చోటునో కనిపెట్టే
సాహసయానివా నువ్వు
ఐతే అంతిమత్వ పుదీవిలో
దేవులాడరా వెధవా
నీకు నువ్వే దొరకవా...?

సంకేతస్థలం లో కలుసుకుని
జ్ఞాపకాలన్నీ తలపోసుకుంటావా
అంత సమయమెక్కడుందిరా బాబూ

ఏ ఖనన వాటికలో
దహనమౌతావో నువ్వు
ఏ జనన పేటికలో
బిడ్డవౌతావో మళ్ళీ.
దేహాలు ఏకమయ్యే చోట కూడా
అస్థిత్వాన్ని వీడం
సమాధుల మీద కూడా
సొంత ముద్రలనే కోరుకుంటాం
ఉపద్రవమొచ్చినప్పుడే
వైరాగ్యాన్ని కొనుకుంటాం
ఉనికిని వదిలెయ్యడమే
వైరాగ్యమన్న పరమ సత్యాన్ని మరచి
మనతో మనమే
నటిస్తూ జీవిస్తాం.
రతి కార్యం
సృష్టి కొనసాగడానికి జరిగే
మహాయజ్ఞం
ఆ యజ్ఞం నుంచే మనం జన్మించాం
ఆ మూలాలనుంచే మానవ వికాసాన్ని నిర్మించాం
భాషలోను భావంలోనూ
కోపంలోను తాపంలోనూ
అడుగడుగునా
అణువణువునా
వాంచను నింపుకున్న
కామ'కులం' మనం
కాని మనమేం చేస్తున్నాం
కామ ఉద్దీపనలే తాయిలాలుగా గల
పరలోక సుఖాలకోసం
దాన్ని సమాధి చేసే పునాదుల మీద
నిర్మించిన మతాలకు బందీలయ్యాం
ప్రేమగా పుష్పించాల్సిన కామాన్ని
కాలరాయమన్న ప్రభోదాలతో
మూలాన్ని తుడిచివేయాలన్న ఉపదేశాలతో
అబద్దాలతో
ఆత్మవంచనతో
ప్రేమరాహిత్యంలోకి నెట్టబడ్డ విషబీజాల నుంచి
కామ కురూపులుగా పెంచపడ్డాం
ఇప్పుడు ఎవరి బుర్రను బొమ్మకట్టినా
కనిపించేది విశృంఖల కామక్రీడాఖేలేనని
నిరూపించడానికి సిగ్మండ్ ఫ్రాయిడ్ అక్కరలేదు
గడ్డిపూల సేద్యంలో
మల్లెపూల సౌరభాలను ఎలా కాంక్షించగలమ్...?
వ్యాదిగ్రస్త సమాజంలో
డిల్లీ మానభంగం ఓ రోగలక్షణం...అంతే ...!