7.25.2012

సాగిపో సోదరా....ఆగిపోకు ఎక్కడా....!

మోసకారులకు భయపడి 
ఆశ వదులుకోకు
శకుని ఆటకు భయపడి 
పోరు వీడిపోకు
ఎండమావి అని తెలిసేవరకు 
దాహం తీర్చింది ఆశే అని మర్చిపోకు.
రణరంగంలో కన్నుమూసే వరకు
అంతిమ విజయం నాదే అని పలవరించు.
కటిక చీకట్లో కృంగిపోయేటప్పుడు
ఒక సూర్యుడినే నువు భ్రమించు.
గుండెల నిండా ఆశల ఎంజైమ్ ఉంటే
ప్రతి వైఫల్యం ప్రసూతి వైరాగ్యమే ...
సాగిపో సోదరా....ఆగిపోకు ఎక్కడా....