9.27.2010
మన తాతలు తాగిన నేతి వాసన మన మూతులకు రాదు.ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామిక దేశంలో ప్రశ్నకు పైకం తీసుకునే పార్లమెంటు సభ్యులున్నదుకు మనం సిగ్గుపడాలి.ఎక్కువ శాతం ఓట్లు సాధించిన పార్టీని అధికారంలోకి తీసుకురాలేని రాజ్యాంగాన్ని చూసి మనం సిగ్గుపడాలి.దేశ సంవత్సర ఆదాయానికన్నా పదిరెట్లు విలువైన రెడ్ కారిడార్ ఖనిజ సంపదను వేదాంత లాంటి కార్పోరేట్ కంపెనీలకు కట్టబెట్టేందుకు నిస్సిగ్గుగా యుద్ధం చేస్తున్న ప్రజాస్వామిక దేశాన్ని చూసి సిగ్గుపడాలి.ప్రజల కనీస అవసరాలు తీర్చలేని ప్రభుత్వం దేశ ప్రజలందరి సొత్తును నీతిమాలి తెగనంమ్ముకుంటున్నా తెగించి పోరాడలేని మన ముఖం మ్మీద మనమే ఉమ్ముకుని మరీ సిగ్గుపడాలి.పౌష్టికాహారం మాట అటు ఉంచి కనీసం పరిశుభ్రమైన మంచి నీరు దొరకక డయేరియాతో ఏటా సంభవించే లక్ష శిశు మరణాలను చూసి సిగ్గుపడాలి.కాసు(కట్నం)లేకుండా కన్యత్వం కుడా కోల్పోలేని వివాహ వ్యాపారాన్ని చూసి సిగ్గుపడాలి.వ్యభిచారం చట్ట వ్యతిరేకమైన పరమ పవిత్ర దేశంలో ముంబై స్టాక్ మార్కెట్ కు సరిసమానంగా జరిగే లైంగిక లావాదేవీలను చూసి సిగ్గుపడాలి.వేలమంది మరణానికి,శాశ్విత అంగవైకల్యానికి కారణమైన ఆండర్సన్ ను ఉరితీయడం అటుంచి కనీసం వంద రూపాయల జరిమానా కుడా వెయ్యలేని న్యాయ వ్యవస్తను చూసి సిగ్గుపడాలి.గతమెంతో ఘనమని చెప్పి కుళ్ళిపోయిన వ్యవస్తను కప్పిపుచ్చుకుంటే లాభం లేదు ….నిజాన్ని ప్రపంచానికి చాటడంలో తప్పులేదు.ఐనా మన దేశానికి కావాల్సింది సంస్కరణ కాదు ….సర్జికల్ ఆపరేషన్
Subscribe to:
Posts (Atom)