ప్లాస్టిక్ పలుకులు
ఆర్టిఫీషియల్ నవ్వులు
సింథటిక్ ప్రేమలు
గర్భాన్ని మోయలేని అమ్మలు
సమయాభావం తో పాలివ్వలేని తల్లులు
వయసు మోయలేని చదువులు
మనసు భరించలేని బరువులు
కర్మఫలం ఒకటుంటుందని తెలియక
కాలంతో అనుక్షణం పరుగులు
జీవన్మరణ ఘోషలు
అంతేలేని ఆరాటాలు
పోరాటాలు
ఇంతేలే జీవితం అని సర్డుకోలేని సందిగ్దంలో జీవన సమరం
చేరేనా ఎప్పటికైనా విజయసాగర తీరం......?