3.20.2011

ఎకనమిక్ విత్తనాలు
కామర్స్ వృక్షాలు
ఏ విత్తు నాటితే ఆ చెట్టు
మనకు తెలిసి
వ్యవసాయమే కదా సృస్టికార్యం.
వ్యయసాయం వ్యాపారమైన చోట
పొగాకు చెక్కలు
గంజాయి మొక్కలు
ఉప్పునీటి కయ్యలు
పచ్చటి పుడమితల్లి కడుపున
చెడబుడుతున్న కాన్సర్ కణాలు.
మనకు తెలిసి
అన్నం పెట్టే అమ్మ కదా రైతంటే
మరేంటో ఈ దౌర్భాగ్యం
పచ్చనోటు
ప్రకృతి సంబంధాలతో రమించి
ఆర్ధిక సంబంధాలను కనేసి
అమ్మతనాన్నే అమ్మజూపుతున్న వేల
వ్యవసాయం వ్యభిచారం ఒక్కటే కదా.