7.19.2012


తథాగతుడు యధాతదంగా ఉద్భవించాడా
వేశ్యావాటికలో మునిగితేలిన తర్వాతకదా
యోగి వేమన జన్మించాడు
పరమ కిరాతకుడైన ఓ బోయవాడు కాదా
రామాయణ మహాకావ్యాన్ని రాసింది
అంతెందుకు
రంగురంగుల సీతాకోకచిలుక
ఒకప్పుడు గొంగళి పురుగేగా
ఇప్పుడు నేనేదైతే ఏంటి
రేపేమౌతానో నీకు తెలుసా ఏంటి...?