9.24.2013

చావు బేరం



విద్యార్ధి ఆత్మహత్య
చానలోడికి సెన్సేషనల్ న్యుసేమీ కాదు.
పత్తి రైతు ఆత్మహత్య
పేపరోడు లక్షన్నొకటోసారి రాసే ఇంపోజిషన్ మాత్రమే.
సకుటుంబ సపరివారంగా ఉరేసుకుంటే
అరగంట ప్రాయోజిత కార్యక్రమం.

బతకలేని బతుకుల లెక్క
బలవంతపు చావుల లెక్క
సరిసమానమైన సంధి యుగంలో మనమున్నాం...
ఐనా భయం వలదు
వెల లేని జీవితాలకు
ప్రభుత్వం వారి కనీస మద్దతు ధర
అక్షరాలా లక్ష రూపాయలు...
ఏ చానలోడి పుణ్యంతోనో
ఏ పేపరోడి సౌజన్యంతోనో

ఏ నాయకుడి దాక్షిణ్యంతోనో
మీ చావు సెన్సేషనల్ ఐతే
గరిష్ట మద్దతు ధర ఐదు లక్షలు...!
మామంచి చావు బేరం
ఆలశించిన ఆశాభంగం.

No comments:

Post a Comment