9.17.2013

నేను దేవుడిని...నేనే దేవుడ్ని


పురుడు పోసుకోవడానికి
వేచి వున్న విత్తును నేను
పరంపరలో పడి
కొట్టుకుపోతూనే ఉంటాను.
 

ఎప్పుడో చచ్చిపోయిన
సుప్తాస్తికను నేను
కోటానుకోట్ల సార్లు
చచ్చి బ్రతుకుతూనే ఉంటాను.
 

జనన మరణ పరిచక్రంలో
భూమే స్వర్గం
బ్రతుకే మోక్షం
నేనే దైవం

నేనే దైవం.

No comments:

Post a Comment