5.06.2012

మనునీతి

పిల్లి కూతలకు
వెర్రి కేకలకు
బాణీలు కట్టి
వుర్రూత లూగి
నీతికి పాదు చేసి
బీరు పోసి
గీత దాటి స్ఖలించిన వారే
నీతి నీతి అని ఘీంకరిస్తారు.

సరళ రేఖపై జీవించి
వలపు రేఖపై విరహించి
నీతి గీతపై నటించిన వారే
స్వేచ్ఛ స్వేచ్ఛ అని పలవరిస్తారు.

బంగారు కచ్చడాలను
స్వచ్చందంగా కౌగలించుకుని
పాతివ్రత్యానికి
దాంపత్య విధేయతను ప్రకటించుకుని
సడలించిన సంకెళ్ళతో
ప్రణయగీతికి తకదిమె తాళమేస్తారు.
దాటుతున్న గీతను సవరిద్దాం
అన్న వాడి బతుకు ఆగం చేస్తారు.

భావగట్టు శృంగారానికి
ఏకంగా ఒక కులాన్నే సృష్టించుకున్న జాతిలో
నీతికింక విలువేముంది అంటే వెలివేస్తారు.
లైంగికతనే విలువలుగా
చిలువలు పలువలుగా
పురాణాలు పుక్కిలిస్తారు.

స్త్రీ ఒక్కరిది కానప్పుడు
పదువురు పంచుకోవడం మగనీతి.
దేహవాంచ దహించివేస్తున్నా
చర్మగీతి దాటకూడదన్నది ఆడనీతి.
పుక్కిటి గాధలకు
తలుకుబెలుకుల నీతి చమకులద్ది
భయపెట్టడం సంఘనీతి.

ఏక నీతి
ఏక రీతి
లేని జాతిలో
సమిష్టిగా కనుకోనబడిన
కనిష్ట వాణిజ్య గునిజమే

ధమన'మను'నీతి.